ప్రభుత్వం ఏర్పాటై 10 రోజులు కూడా కాలేదు.. అప్పుడే
రైతుబంధుపై బీఆర్ఎస్ నేతలు మాటలు ఆశ్చర్యం కలిగిస్తున్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా సిద్దిపేట జిల్లా గజ్వేల్లో పర్యటించారు. ఈ సందర్భంగా పొన్నం మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజుల్లోనే 2 గ్యారంటీలను అమలు చేశామని, మిగతావి 100 రోజుల్లో పూర్తి చేస్తామని వెల్లడిరచారు. 6 గ్యారంటీలపై బీఆర్ఎస్ నేతల మాటలు విడ్డూరంగా ఉన్నాయన్నారు. రైతుబంధు పథకంపై మాజీ మంత్రి హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వం ఏర్పాటై 10 రోజులు కూడా కాలేదని, అప్పుడే రైతుబంధు నిధులు విడుదలలో ప్రభుత్వం జాప్యం చేస్తోందని విమర్శించడం సరికాదన్నారు. కాంగ్రెస్ పార్టీ మాట మీద ఉంటుందని, 100 రోజుల్లో 6 గ్యారంటీలను కచ్చితంగా అమలు చేస్తామని అన్నారు. బీసీ బంధుపై సమీక్షిస్తామన్న ఆయన, ప్రతి శాఖపై శ్వేతపత్రం విడుదల చేస్తామన్నారు.













