ఎన్ని కష్టాలున్నా ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలు : పొన్నం
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి ఎన్ని కష్టాలున్నా ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేస్తామని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో ప్రజా పాలన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొన్నం మాట్లాడుతూ హుస్నాబాద్‌లో అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పనులను పూర్తిచేసి, గతంలో గుర్తించిన లబ్ధిదారులకు అందించాలని ఆర్డీవోను ఆదేశించామన్నారు. భూ నిర్వాసితులు సమస్యలు పరిష్కరించి, గౌరవెల్లి, గండిపల్లి ప్రాజెక్టుల ద్వారా రైతులకు సాగు నీరు అందిస్తామన్నారు.













