హనుమకొండ ఆర్డీవోపై .. మంత్రి పొన్నం ప్రభాకర్ ఫిర్యాదు

హనుమకొండ ఆర్డీవోపై సీఎస్ శాంతికుమారికి తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్న ప్రభాకర్ ఫిర్యాదు చేశారు. తన ఫోన్‌కాల్ రికార్డు చేసి ప్రతిపక్ష ఎమ్మెల్యేకు పంపించారని అందులో పేర్కొన్నారు. వెంటనే ఆర్డీవోపై శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్‌తో కరవు వచ్చిందంటూ ప్రతిపక్ష నేతలు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని తెలిపారు. పంట నష్టంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.