ఆర్థిక సంక్షోభం ఉన్నా.. ఆరు గ్యారంటీలు అమలు చేస్తాం
తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ ఆరు గ్యారంటీలు అమలు చేసి తీరుతామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ఖమ్మం కలెక్టరేట్లో అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో మరో రెండిరటిని సంక్రాంతి పండుగ నాటికి అమలు చేస్తామన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ఆరు గ్యారంటీల అమలుకు చర్యలు తీసుకుంటాం. ఈ నెల 28న మరో రెండు గ్యారంటీలు అమలు చేస్తాం. మాది కక్ష సాధింపు ప్రభుత్వం కాదు. అధికారులపై కక్ష సాధింపు చర్యలు ఉండవు. ప్రభుత్వ ఆస్తులు కొల్లగొట్టిన వారిని, బినామీ కాంట్రాక్టులు తీసుకున్న వారిని వదిలిపెట్టం. ఈ నెల 20న ప్రజల ముందు శ్వేతపత్రం ఉంచుతాం అని అన్నారు.













