వాళ్లిద్దరు ఎవరి ఉచ్చులో ఉన్నారో అందరికి తెలుసు
బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ను మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి విమర్శించడం సరికాదని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. జూపల్లి, పొంగులేటిని బీఆర్ఎస్ సస్పెండ్ చేసిన నేపథ్యంలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ పార్టీకి అతీతులమనే వ్యక్తిగత ధోరణిని ఎవరూ సహించరని తెలిపారు. ఆ ఇద్దరు నాయకుల ప్రవర్తనను పార్టీ ఇన్నాళ్లూ సహనంతో పరిశీలించింది. చాలాకాలం సంయమనంతో వ్యవహరించింది. పదవులు అనుభవించిన తర్వాత విమర్శలు చేయడం తగదు. ఇద్దరు నాయకులూ అసహనం వెళ్లగక్కుతూ నిందలు మోపారు. కొంతకాలం వేచిచూడాలని కేసీఆర్ చెప్పారు. రాజకీయంగా అవకాశం రాలేదని వాళ్లిద్దరూ దుమ్మెత్తి పోస్తున్నారు. ఇద్దరు నేతలు ఎవరి ఉచ్చులో ఉన్నారో అందరికీ తెలుసు. పార్టీ అధినేతను బలహీనపరిచే యత్నాలు ఫలించవు అని అన్నారు.













