ఈ శతాబ్దపు అతి పెద్ద విజయం : మంత్రి నిరంజన్ రెడ్డి
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును పూర్తి చేయడం, ఈ శతాబ్దపు అతి పెద్ద మానవ విజయంగా తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అభివర్ణించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను పూర్తి చేశామన్నారు. ప్రాజెక్టు పనులు ముందుకు సాగకూండా ఎన్నిక అవరోధాలు వచ్చినప్పటికీ అన్నింటినీ ఎదుర్కొని పనులు పూర్తి చేశామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సొంత నిధులు రూ.25 వేల కోట్లతో దశల వారీగా కేటాయించుకుని అత్యంత అద్భుతంగా ప్రాజెక్టు పూర్తి చేసుకున్నామని అన్నారు. పరాయి పాలన ఒక శాపం, స్వపరిపాలన ఒక వరం అని అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో పాలమూరు ప్రాజెక్టును పూర్తి చేసుకున్నాం. ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన నార్లాపూర్ పంప్ హౌస్లో మోటార్లను ఈ నెల 16న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా నిర్వహించే బహిరంగ సభకు పెద్ద ఎత్తున ప్రజలు, రైతులు తరలి రావాలని పిలుపునిచ్చారు.













