మంత్రి మల్లారెడ్డికి అరుదైన గౌరవం… దేశంలోనే తొలిసారి
తెలంగాణ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. వైద్య విద్యా రంగంలో చేస్తున్న కృషికి గుర్తింపుగా ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఆయనను వైద్య విద్య దార్శనికుడు అవార్డుతో సత్కరించింది. 77వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జరిగిన వేడుకల్లో ఆయనకు విజనరీ మ్యాన్ అవార్డును ప్రదానం చేసింది. దేశంలో తొలిసారి మంత్రి మల్లారెడ్డికే ఈ గుర్తింపు లభించడం విశేషం. మల్లారెడ్డి హెల్త్‌సిటీ, మల్లారెడ్డి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ను స్థాపించి వైద్య విద్యకు ఆయన అందిస్తున్న సేవలు ఎనలేనివని ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ ప్రతినిధులు ప్రశంసించారు. తెలంగాణలోనే అతిపెద్ద మెడికల్ క్యాంపస్‌గా పేరుగాంచిన మల్లారెడ్డి హెల్త్‌సిటీలో దాదాపు 2 వేల మంది వైద్య విద్యార్థులు, వెయ్యి మంది దంతవైద్య విద్యార్థులతో పాటు మరో 500 మంది విద్యార్థులు జనరల్ మెడిసిన్, దంత వైద్యవిద్యలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు.













