డేటా సెంటర్లకు హైదరాబాద్ అనుకూలం : కేటీఆర్
డేటా సెంటర్ల నిర్వహణలో తెలంగాణ ఇప్పటికే తన సమర్థతను నిరూపించుకొందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. డేటా సెంటర్లకు హైదరాబాద్ అనుకూల ప్రదేశంగా ఉందని పేర్కోన్నారు. ఈ మేరకు అంతర్జాఈయ డేటా రాయబార కార్యాలయాల అంశంపై కేంద్ర ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఆయన లేఖ రాశారు. గుజరాత్‌లోని గిఫ్ట్ సిటీలో డేటా ఎంబసీలను ఏర్పాటు చేయాలనే బడ్జెట్ ప్రతిపాదన గురించి లేఖలో ప్రస్తావించారు. అంతర్జాతీయ డేటా రాయబార కార్యాలయాలను ఒకే ప్రదేశంలో ఏర్పాటు చేయడం వల్ల కలిగే నష్టాలను వివరించారు. భూకంపాలకు ఎక్కువ అవకాశమున్న రాష్ట్రంలో అంతర్జాతీయ డేటా రాయబార కార్యాలయాలను ఏర్పాటు చేయడం వల్ల భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉందన్నారు. మరొక దేశంతో సరిహద్దు పంచుకొనే రాష్ట్రంలో నిర్మిస్తే భద్రతాపరంగానూ ముప్పు ఉంటుందని కేటీఆర్ పేర్కొన్నారు.













