వరంగల్ కు మరో ఐటీ కంపెనీ రాక
వరంగల్ జిల్లాకు ప్రముఖ ఐటీ కంపెనీలు వరుసకడుతున్నాయి. తాజాగా క్వాడ్రంట్ రిసోర్సెస్ ప్రైవేటు లిమిటెడ్ తన బ్రాంచ్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. మణికొండ ఐటీపార్కులోని ఎకరం స్థలంలో ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. ఈ నెల 16న బ్రాంచీ భవన నిర్మాణానికి భూమిపూజ చేయనున్నామని, దీనికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, పలువురు ప్రముఖులు హాజరవుతారని క్వాడ్రంట్ రిసోర్సెస్ కంపెనీ సీఈవో కంచరకుంట్ల వంశీ రెడ్డి తెలిపారు. మణికొండలోని ఐటీపార్కులో ఇప్పటికే దిగ్గజ కంపెనీలైన టెక్ మహీంద్రా, సైయెంట్ తన బ్రాంచీలను ఏర్పాటుచేశాయి.
సీఎం కేసీఆర్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ చొరవతో మరో అంతర్జాతీయ ఐటీ కంపెనీ మైండ్‌ట్రీ కూడా వరంగల్‌లో తన కార్యకలాపాను సాగించేందుకు ముందుకొచ్చింది. ఐటీ కంపెనీల రాకతో స్థానిక యువతకు పెద్దఎత్తున ఉపాధి భించే అవకాశం ఉన్నది. తెంగాణ ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ చొరవతో ద్వితీయశ్రేణి నగరం వరంగల్‌కు ఐటీ కంపెనీలు తరలివస్తున్నాయి.













