వరంగల్ ప్రజలకు మంత్రి కేటీఆర్ ఉగాది గిఫ్ట్
ఉగాది పర్వదినం సందర్భంగా తెలంగాణ ఐటీ, మున్సిపల్ శాఖా మంత్రి కేటీఆర్ వరంగల్ ప్రజలకు ఓ గిఫ్ట్ ఇచ్చారు. ప్రజల దాహార్తిని తీర్చే ఇంటింటికీ మంచినీటి సరఫరా పథకాన్ని కేటీఆర్ ప్రారంభించారు. వరంగల్ నగర వాసులకు ప్రతి రోజు స్వచ్ఛమైన నీరు అందించే మిషన్ భగీరథ కార్యక్రమాన్ని ప్రారంభించారు. 8 లక్షల లీటర్ల సామర్థ్యంతో ట్యాంకు నిర్మాణాన్ని చేపట్టగా, ఇందుకోసం 939 కోట్ల రూపాయలు ఖర్చయ్యాయి. అయితే అమృత్‌పథకం కింద 413 రూపాయల కోట్లను ఖర్చు చేశారు. ఇక దేశాయిపేటలో జర్నలిస్టుల ఇళ్లకు, దూపకుంటలో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇళ్లకు కేటీఆర్ శంకుస్థాపన చేశారు. మరోవైపు మంత్రి కేటీఆర్ కాన్వాయ్‌ను ఏబీవీపీ కార్యకర్తలు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఇటీవల కేయూలో ఆత్మహత్య చేసుకున్న సునీల్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇక లక్ష్మీపురంలో 24 కోట్లతో నిర్మించిన అత్యాధునిక సమీకృత మార్కెట్‌ను, 624 కోట్లతో నిర్మించిన ఆదర్శ కూరగాయల మార్కెట్‌ను కూడా మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.













