హైదరాబాద్ వేదికగా జరగడం తెలంగాణకు గర్వకారణం
వరల్డ్ ఐటీ కాంగ్రెస్ సదస్సు హైదరాబాద్ వేదికగా జరగడం తెలంగాణకు గర్వకారణమని మంత్రి కేటీఆర్ అన్నారు. హెచ్సీసీలో ప్రపంచ ఐటీ కాంగ్రెస్ సదస్సు ప్రారంభమైంది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రపంచంలో సాంకేతికత తిరుగులేని శక్తిగా తెలంగాణ ఎదుగుతుందని తెలిపారు. ప్రతి పౌరుడు డిజిటల్ పరిజ్ఞానం పొందాలనే సంకల్పంతో ఆప్టికల్ ఫైబర్ ద్వారా ఇంటింటికి ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించనున్నట్లు తెలిపారు. మిషన్ భగీరథను ఉపయోగించుకొని ఇంటింటికీ బ్రాడ్ బ్యాండ్ ఏర్పాటు చేస్తామన్నారు. రంగారెడ్డి జిల్లాలోని మహేశ్వరం, తుమ్మలూరు, మన్సాన్పల్లి, సింగూర్పూర్లో ఫైలట్ ప్రాజెక్టుగా టీడీఎన్ను అమలు చేస్తామన్నామని అన్నారు. ఫైబర్ గ్రిడ్ ద్వారా ఇంటింటికి ప్రభుత్వ కార్యక్రమాలు, పథకాలు అందుబాటులోకి వస్తాయన్నారు. డిజిటల్ తెలంగాణను తయారు చేయడమే లక్ష్యమని కేటీఆర్ సృష్టం చేశారు. ప్రపంచంలోని దిగ్గజ ఐటీ సంస్థలు హైదరాబాద్ కేంద్రంగా పని చేస్తున్నాయని సృష్టం చేశారు. ఐటీకి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. కరీంనగర్, వరంగల్లో ఐటీ సేవలను విస్తరిస్తున్నామని తెలిపారు.













