వారంటీ లేని పార్టీ ఇప్పుడు గ్యారంటీలు : మంత్రి కేటీఆర్
సూర్యాపేట జిల్లాలో అర్హులైన లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పంపిణీ చేశారు. అనంతరం దళిత బంధు చెక్కులను అందజేసి, సూర్యాపేట ఐటీ హబ్ సహా మహిళా కమ్యూనిటీ హాల్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో కరెంటు కావాలంటే ఏఈ, డీఈకి ఫోన్ చేయాల్సి వచ్చేది. 3 గంటలకు మించి కాంగ్రెస్ పార్టీ కరెంటు ఇవ్వలేదు. బీఆర్ఎస్ హయాంలో 24 గంటలు ఇస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ వారంటీ పూర్తయి వందేళ్లు అయింది. వారంటీ లేని పార్టీ ఇప్పుడు గ్యారంటీలు ఇస్తుంది. కాంగ్రెస్ పార్టీలో సీట్లు అమ్ముకుంటున్నారు. ఒకవేళ కాంగ్రెస్‌కు అవకావం ఇస్తే రాష్ట్రాన్ని అమ్మేస్తారు. మాది కుటుంబ పాలన అని మోదీ విమర్శిస్తున్నారు. అవును మాది కుటుంబపాలనే, రైతులే మా కుటుంబం. మాది గాంధీ వారసత్వం అయితే, బీజేపీది గాడ్సే వారసత్వం అని మండిపడ్డారు.













