వారు చేసిందేమీ లేదు.. సాగర్ ను అన్ని విధాలా : మంత్రి కేటీఆర్
సాగు, తాగునీరులో దేశానికి ఆదర్శకంగా నిలిచామని తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. హాలియాలో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేటీఆర్ మాట్లాడారు. ఆరేడు దశాబ్దాలుగా అధికారంలో ఉండి ఏమీ చేయలేదని పరోక్షంగా కాంగ్రెస్‌ను ఉద్దేశించి ఆరోపించారు. ఎమ్మెల్యే నోముల భగత్‌కు, నాగార్జున సాగర్ నియోజకవర్గానికి అండటా ఉంటామని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశీర్వాదంతో ఎమ్మెల్యే నోముల భగత్ రూ.820 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారని తెలిపారు. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న నెల్లికల్ ఎత్తిపోతల పథకం పరుగులు పెడుతున్నది. ఈ ఎత్తిపోతలను రూ.670 కోట్లతో పూర్తి చేస్తామన్నారు. ఆధునీకమైన మినీ స్టేడియం కోసం రూ.3 కోట్ల 75 లక్షలు మంజూరు చేశామన్నారు. ఓపెన్ డ్రైన్ సమస్య పరిష్కారానికి రూ.15 కోట్లు మంజురు చేస్తామని ప్రకటించారు.
తెలంగాణ రాష్ట్రంలో వెయ్యికి పైగా విద్యాసంస్థలు ప్రారంభించాం. విదేశీ విద్య కోసం రూ.20 లక్షలు ఇస్తున్నామన్నారు. రైతులకు 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తున్నాం. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే సాధించుకున్నాం రైతులుకు ఏదో చేస్తామని, మరోసారి అవకాశం ఇవ్వాలని కొంతమంది అడుగుతుంటారు వాళ్లను నమ్మొదు అని అన్నారు.













