సాంకేతిక యుగంలో అవకాశాలకు కొదువ లేదు : మంత్రి కేటీఆర్
సాంకేతిక యుగంలో అవకాశాలకు కొదువ లేదని తెలంగాణ రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. నిర్మల్ జిల్లాలోని బాసర ట్రిపుల్ ఐటీ ఐదో స్నాతకోత్సవానికి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ పుస్తకాల్లో చదువుకున్న చదువుకు ప్రయోగాత్మక విద్య తోడైతే ఫలితాలు దక్కుతాయని వెల్లడిరచారు. ప్రపంచంలో పోటీపడగలిగే సత్తా సంతరించుకోగలిగితే ఆపగలిగేవారు ఉండరని తెలిపారు. ఉన్నత విద్యాలయాల్లో మౌలికవసతలు కల్పనకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేవారు. రాష్ట్రంలో ఉన్నత విద్యాసంస్థలను మరింత మెరుగ్గా తీర్చి దిద్దాలని సీఎం కేసీఆర్ ఆదేశించారని తెలిపారు. విద్యార్థులకు ప్రాక్టికల్ నాలెడ్జ్ ముఖ్యమని తెలిపారు. టీహబ్‌తో బాసర ట్రిపుల్ ఐటీ ఒప్పందం కుదుర్చుకుందని వెల్లడిరచారు. దేశంలో మొట్టమొదటి ప్రైవేట్ శాటిలైట్ పంపింది హైదరాబాద్ టీ హబ్ కంపెనీయేనని గుర్తు చేశారు. పది మందికి ఉపాధి కల్పించే స్థాయికి మనం ఎదగాలని తెలిపారు. ట్రిపుల్ ఐటీకి ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తానన్నానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హాజరయ్యారు.













