టీఆర్ఎస్ ప్లీనరీ… ఏడు కమిటీలు ఏర్పాటు
ఈ నెల 27న మాదాపూర్ హెచ్ఐసీసీలో టీఆర్ఎస్ ప్లీనరి సమావేశం జరుగనున్నది. ఈ సందర్భంగా పోలీసు, ట్రాఫిక్, జీహెచ్ఎంసీ అధికారులతో పాటు హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్యేలు, పార్టీ నేతలతో టీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. పార్టీ ఆవిర్భావ వేడుకల సందర్భంగా నగర ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. పార్టీపరంగా చేపట్టే కార్యక్రమాలపై నగర పరిధిలో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులకు కేటీఆర్ దిశానిర్దేశం చేశారు. టీఆర్ఎస్ ఫ్లీనరీ సందర్భంగా ఆ పార్టీ వివిధ కమిటీలను ఏర్పాటు చేసింది. ఈ కమిటీల్లో పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులకు బాధ్యతలు అప్పగించారు. ఆహ్వాన కమిటి, సభా ప్రాంగణం అలంకరణ, ప్రతినిధుల నమోదు, వాలంటీర్ వ్యవస్థ, పార్కీంగ్, ప్రతినిధుల భోజనం, తీర్మానాలు, మీడియా, తదితర కమిటీలను టీఆర్ఎస్ ఏర్పాటు చేసింది.













