విద్యావంతులందరూ ఓటు హక్కు వినియోగించుకోండి : కేటీఆర్
తెలంగాణలో ఎమ్మెల్సీ పోలింగ్ కొనసాగుతోంది. మహబూబ్నగర్-హైదరాబాద్- రంగారెడ్డి- వరంగల్-ఖమ్మం- నల్గొండ స్థానాల పట్టభద్ర ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఈ పోలింగ్ నాలుగు గంటల వరకూ కొనసాగుతుంది. రాష్ట్ర ఐటీ, మున్సిపల్ మంత్రి కేటీఆర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. షేక్పేట్ పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… విద్యావంతులందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. విద్యావంతులు ఓటు హక్కు వినియోగించునే క్రమానికి దూరంగా ఉంటారన్న అపోహను తొలగించాలని కోరారు. ఇక బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి రాంచందర్ రావు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. హన్మకొండలోని ఆర్ట్స్ కళాశాలలో బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఓటు వేశారు. నర్సంపేటలో యువతెలంగాణ అభ్యర్థి రాణిరుద్రమ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక మంత్రి జగదీశ్ రెడ్డి కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి వేలేరులో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.













