హైదరాబాద్ అభివృద్ధిపై 6 సం|| ప్రగతి నివేదిక విడుదల చేసిన కేటీఆర్
హైదరాబాద్ అభివృద్ధిపై 6 సంవత్సరాల ప్రగతి నివేదికను విడుదల చేసిన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడూతూ…
ఇంటింటికీ వెళ్లి టీఆర్ఎస్ చేసిన పనుల గురించి చెప్పి ఓట్లు అడగాలని టీఆర్ఎస్ అభ్యర్థులకు సూచించారు. హైదరాబాద్లో వరద బాధితులను ప్రభుత్వం ఆదుకుంది. ఆరున్నర లక్షల మందికి రూ.650 కోట్ల సాయం అందించాం. రాష్ట్రానికి జరిగిన వరద నష్టంపై కేంద్రానికి సీఎం శ్రీ కేసీఆర్ లేఖ రాశారు. ఇప్పటి వరకు కేంద్ర సాయం అందలేదు.
రాష్ట్రానికి పెట్టుబడులు వరదలా వస్తున్నాయి. హైదరాబాద్లో రూ.2లక్షల కోట్లు పెట్టుబడులు వస్తున్నాయి. హైదరాబాద్ బాగుంటేనే తెలంగాణ ఉజ్వలంగా దూసుకెళ్తుంది. రెండు అంశాల గురించి ఆలోచించాలని హైదరాబాద్ ప్రజలకు చెప్పాలి. అభివృద్ధిలో దూసుకెళ్తున్న హైదరాబాద్ కావాలా?. నిత్యం ఘర్షణలతో తల్లడిల్లే హైదరాబాద్ కావాలా?
టీఆర్ఎస్ ప్రభుత్వం ఆరేళ్లలో చేసిన పనులు వంద చెప్పవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఆరేళ్లలో చేసిన ఒక్కపని చూపెడతారా? ఆరేళ్లలో ఎలాంటి గొడవలు లేకుండా ముందుకెళ్తున్నాం.
అభివృద్ధి హైదరాబాదా? లేక అశాంతి హైదరాబాదా? ప్రజలు తేల్చుకోవాలి. ఎలాంటి హైదరాబాద్ కావాలో ప్రజలే నిర్ణయించాలి.
నగరంలో బస్తీ దవాఖానాలు ప్రారంభించాం. గల్లీగల్లీలో బస్తీ దవాఖానాలు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాం. జీవో నెంబర్ 58, 59 కింద లక్ష పట్టాలు పంపిణీ చేశాం. హైదరాబాద్లో మల్టీ పర్పస్ ఫంక్షన్ హాళ్లు నిర్మించాం. 137 కొత్త లింకు రోడ్లు నిర్మిస్తున్నాం. అవసరమైన చోట ఫ్లై ఓవర్లు నిర్మిస్తునాము.
గతంలో తాగునీటి కోసం జలమండలి కార్యాలయాల ముందు బిందెలు, కుండలతో ధర్నాలు ఉండేవి. టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే తాగునీటి సమస్యను పరిష్కరించాము.
హైదరాబాద్లో 25 ఏండ్లుగా ఉన్న నీటిగోసను సీఎం శ్రీ కేసీఆర్ పరిష్కరించారు. కేశవాపురం రిజర్వాయర్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 2050 దాకా హైదరాబాద్ ప్రజలకు మంచినీటి కష్టాలు లేకుండా చేస్తున్నాం. సీఎం శ్రీ కేసీఆర్ ముందు చూపు, ప్రణాళిక ఉన్న నాయకుడు. హైదరాబాద్లో గతంలో వారానికి రెండు రోజులు పవర్ హాలీడే ఉండేది. పారిశ్రామిక వాడల్లో కూడా పవర్ హాలీడే ప్రకటించేవారు. ఇప్పుడు 24 గంటలు కరెంట్ సరఫరా చేస్తున్నాము.
ఆరేళ్లలో నగరంలో పేకాట క్లబ్బులు లేవు, గుడుంబా గబ్బు లేదు. పోకిరీల పోకడలు, ఆకతాయిల ఆగడాలు లేవు. ఆరేండ్ల నుంచి హైదరాబాద్ ప్రశాంతంగా ఉంది. దమ్మున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నాడు కాబట్టే..హైదరాబాద్లో శాంతిభద్రతలు పటిష్టంగా ఉన్నాయి. తెలంగాణకు ఆర్థిక ఇంజిన్ హైదరాబాద్. హైదరాబాద్ బాగుంటేనే అందరూ బాగుంటరు. నగరంలో అల్లర్లు చెలరేగితే తెలంగాణకే నష్టం. ఏపీ ఎమ్మెల్యేలు కూడా హైదరాబాద్లో రూ.5భోజనం బాగుందన్నారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 85 డివిజన్లలో మహిళా అభ్యర్థులకు టికెట్లు కేటాయించాం. ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళా పక్షపాతిగా నిరూపించుకున్నారు. 50 శాతం సీట్లు బీసీలకు కేటాయించాం. అభ్యర్థుల ఎంపికలో అన్ని వర్గాల వారికి ప్రాతినిధ్యం కల్పించాం. అగ్రవర్ణాల వారికి కూడా న్యాయం చేశాం. ఎస్సీలకు 10 సీట్లే రిజర్వ్ అయినా 13 కేటాయించిన ఘనత టీఆర్ఎస్కే దక్కుతుంది.













