ఆ ఘటన ఎంతో కలచివేసింది : మంత్రి కేటీఆర్
వీధి కుక్కల దాడిలో బాలుడు మృతి చెందడం దురదృష్టకమరని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. బాధిత కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. అంబర్‌పేటలో జరిగిన ఘటనలో బాలుడి మృతి తనను ఎంతో కలచివేసింది చెప్పారు. వీధి కుక్కల నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నామని, ఇకపై ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటామన్నారు. కుక్కల దాడిలో నాలుగేళ్ల బాలుడు తీవ్రంగా గాయపడి ప్రాణాలొదిలిన హృదయ విదారక ఘటన హైదరాబాద్ అంబర్‌పేటలోని ఛే నంబర్ చౌరస్తా వద్ద చోటు చేసుకుంది. జంతువులు వేటాడినట్టుగా కుక్కలన్నీ ఆ చిన్నారిపై అన్ని వైపుల నుంచి దాడిచేయడంలో నిస్సహాయంగా శరీరాన్ని వాటికి అప్పగించి ప్రాణాలు కోల్పోయాడు.













