పశ్నపత్రాల లీక్ పై … మంత్రి కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు
వ్యాఖ్యలు స్వార్థ రాజకీయాల కోసం విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలతో బీజేపీ నేతలు చెలగాటమాడుతున్నారని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ విమర్శించారు. పదో తరగతి ప్రశ్నపత్రాల లీక్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అరెస్టు తదనంతర పరిణామాల నేపథ్యంలో మంత్రి స్పందించారు. ఈ సందర్బంగా కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పిచ్చోడి చేతిలో రాయి ఉంటే వచ్చి పోయేటోళ్లకే ప్రమాదం. అదే పిచ్చోడి చేతిలో ఒక పార్టీ ఉంటే ప్రజాస్వామ్యనికే ప్రమాదం. స్వార్థ రాజకీయాల కోసం ప్రశ్నపత్రాలు లీక్ చేసి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నరని అని కేటీఆర్ మండిపడ్డారు.













