కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. కేంద్రం చేతిలో పెట్టారు : కేటీఆర్

ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 30వేల ఉద్యోగాలు ఎలా ఇచ్చారని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. నల్గొండ జిల్లా హాలియాలో నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు. గత పదేళ్లులో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నో సంస్కరణలు అమలు చేసిందన్నారు. తమ హయాంలో జరిగిన అభివృద్ధిని గుర్తు చేసుకోవాలన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 1.8 శాతం ఓట్ల తేడాతో అధికారం కోల్పోయాం. బీఆర్‌ఎస్ ప్రభుత్వం పనిచేసి కూడా చెప్పుకోలేకపోయింది. గత పదేళ్లలో ప్రభుత్వం 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చింది. కృష్ణానదిపై కేంద్ర అజమాయిషీకి కేసీఆర్ ఒప్పుకోలేదు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నాగార్జున సాగర్‌ను కేంద్రం చేతిలో పెట్టారు అని విమర్శించారు.