‘తెలంగాణ గెలిస్తే చాలు’… అని సమాధానం చెప్పిన పాపకు గిప్ట్ పంపిన మంత్రి కేటీఆర్
తెలంగాణ మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఓ పాప ఇచ్చిన సమాధానానికి చలించి పోయారు. చలించి పోవడమే కాకుండా వెంటనే ఓ గిఫ్ట్ కూడా పంపించారు. కరీంనగర్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ కార్యకర్త ఖాజా హుస్సేన్ కుమార్తె పుట్టిన రోజు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా మంత్రి కేటీఆరే స్వయంగా ఆమెకు ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. పుట్టిన రోజు సందర్భంగా ఏం గిఫ్ట్ కావాలో కోరుకో… అని కేటీఆర్ అడిగారు. ‘తెలంగాణ గెలిస్తే చాలు….’’ అని ఆ పాప ఠక్కున సమాధానమిచ్చింది. ఈ సమాధానంతో మంత్రి కేటీఆర్ చలించిపోయారు. వెంటనే ఓ బహుమానాన్ని పంపారు. టీఆర్ఎస్ పార్టీ పట్ల కార్యకర్తలకు ఉన్న నిబద్ధత ఇలాంటిదని, ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. ప్రతి కార్యకర్తను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటామని, వారికి ఏ ఆపద వచ్చినా, అండగా ఉంటామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు.













