వీ హబ్ 5వ వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొన్న మంత్రి కేటీఆర్
హైదరాబాద్ వీ హబ్ 5వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రూ. 1.30 కోట్లు ఇస్తే వీ హబ్ నుంచి ఒక స్టార్టప్‌తో రూ. 70 కోట్లకు పెంచారు. వీ హబ్ ప్రతినిధులకు నా అభినందనలు అని మంత్రి అన్నారు. స్త్రీ నిధి కింద మహిళలకు రుణాలు అందిస్తున్నామని తెలిపారు. రూ. 750 కోట్లు వడ్డీ లేని రుణాలు విడుదల చేస్తున్నామని చెప్పారు. ప్రతీ పారిశ్రామిక పార్కులో 10 శాతం ప్లాట్స్ మహిళలకు కేటాయించామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో మహిళా వ్యాపారులకు సింగిల్ విండో విధానం అమలు చేస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.













