త్వరలో మీరు శుభవార్త వింటారు
కేంద్ర ఉక్కు శాఖ మంత్రి చౌదరి బీరేంద్రసింగ్‌తో తెలుగు రాష్ట్రాల గనుల శాఖ మంత్రులు కే.తారకరామారావు, సుజయకృష్ణ రంగారావు ఢిల్లీలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కడప (ఏపీ), బయ్యారం (తెలంగాణ)లో స్టీల్ ఫ్యాక్టరీల ఏర్పాటుపై వీరి మధ్య చర్చ జరిగింది. విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు స్టీల్ ఫ్యాక్టరీలను నిర్మించాలని తెలుగు మంత్రులు కోరారు. కాగా, ఫ్యాక్టరీల సాధ్యాసాధ్యాలపై టాస్క్‌పోర్స్ ఏర్పాటు ద్వారా పరిష్కరించే యోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ కర్మాగారాల ఏర్పాటుపై గతంలో కేంద్ర ప్రభుత్వం చేసిన పలు అభ్యంతరాలపై తెలుగు మంత్రులు కేంద్ర మంత్రికి వివరణ ఇచ్చేందుకు ప్రయత్నించగా త్వరలో మీకు శుభవార్తే ఉంటుంది అని కేంద్ర మంత్రి బీరేందసింగ్ తెలుగు మంత్రులతో వ్యాఖ్యానించారు.













