ఆస్పత్రిలో చేరిన మంత్రి కేటీఆర్

తెలంగాణ రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ యశోద ఆస్పత్రిలో చేరారు. ఇటీవల ఆయనకు కొవిడ్ పాజిటివ్‍గా నిర్ధారణ కాగా ఆ విషయాన్ని మంత్రి కేటీఆర్ ట్విటర్ ద్వారా వెల్లడించిన విషయం తెలిసిందే. ఏప్రిల్ 23న ఆయనకు కొవిడ్ పాజిటివ్‍గా నిర్ధారణ అయింది. అప్పటి నుంచి హోం ఐసొలేషన్‍లో ఉంటున్నారు. డాక్టర్ల సలహా మేరకు ఆయన ఆస్పత్రిలో చేరినట్లు తెలుస్తోంది. ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు సమాచారం.