ఈటల రాజేందర్ వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ కౌంటర్
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడీ వేడిగా సాగుతున్నాయి. అధికార, ప్రతిపక్ష ఎమ్మెల్యేల మధ్య మాటాలు పేలుతున్నాయి. ఈ క్రమంలో బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీ లో ఆయన మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఇండోనేషియా వెళ్తే వాళ్ల ఫ్రెండ్‌కు గనులు వస్తాయని వ్యాఖ్యనించారు. విశాఖ ఉక్కును తుక్కు కింద అమ్ముతుంది కేంద్రం కాదా అని ప్రశ్నించారు. సింగరేణి విషయంలో కూడా అదే వైఖరిలో కేంద్రం ఉందన్నారు. ఒకరి కోసం దోస్తుల కోసం పనిచేసే ప్రభుత్వం ఇక్కడ లేదన్నారు. కేంద్ర ప్రభుత్వంలా ఒక వ్యక్తినే పల్లకిలో తమ ప్రభుత్వం మోయలేదని స్పష్టం చేశారు. తమ పార్టీ విధానం ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు.













