ఆ కల నెరవేర్చడానికే కేసీఆర్ కామారెడ్డిలో పోటీ
కామారెడ్డి నియోజకవర్గం గురించి రాష్ట్రం మొత్తం చర్చ జరుగుతోందని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. కామారెడ్డి జిల్లా బిక్కనూరులో జరిగిన బీఆర్స్ ప్రజా ఆశీర్వాద సభలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఎందుకు కామారెడ్డిలో పోటీ చేస్తున్నారని చర్చ జరుగుతోందన్నారు. కామారెడ్డి రైతుల కల నెరవేర్చడానికే ఆయన పోటీ చేస్తున్నారని తెలిపారు. ఈ నెల 9న కేసీఆర్ నామినేషన్ వేయబోతున్నారు. నామినేషన్ రోజు వచ్చే ప్రజలను చూసి ఇతర పార్టీలవాళ్లు పోటీ చేసేందుకే భయపడాలి. బీజేపీ ఇచ్చే చాక్లెట్లకు ఆశ పడొద్దు. బీఆర్ఎస్ ఇచ్చే బిర్యానీ తినండి. ఇతర పార్టీలు డబ్బులు ఇస్తే తీసుకోండి. ఓటు మాత్రం బీఆర్ఎస్కే వేయాలన్నారు.
తప్పనిసరి పరిస్థితుల్లో కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది. సోనియాను బలిదేవత అని రేవంత్‌రెడ్డే అన్నారు. రాహుల్ చెప్పినట్టు దొరలకు, ప్రజలకు మధ్య పోరాటమిది. ఢిల్లీ దొరలకు, గల్లీ ప్రజలకు మధ్య ఎన్నికల పోరాటం జరుగుతోంది. ఢిల్లీ అహంకారం, ఢిల్లీ దొరలతో కొట్లాడటం మాకు కొత్త కాదు. తెలంగాణ ఇస్తామని 2004లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్‌కు 55 ఏళ్ల అవకాశం ఇస్తే ఎందుకు కరెంటు, నీళ్లు ఇవ్వలేదు అని ప్రశ్నించారు.













