ఐటీ హబ్‌గా నిజామాబాద్ : కేటీఆర్
ఐటి పరిశ్రమను ద్వితీయ శ్రేణి నగరాలకు విస్తరించనున్నట్లు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు తెలిపారు. నిజామాబాద్ ఎంపి కవిత, నిజామాబాద్ అర్బన్ ఎంఎల్ఏ గణేష్ గుప్తా బేగంపేట క్యాంపు కార్యాలయంలో కేటీఆర్‌ను కలిశారు. ఐటి హబ్‌గా ఏర్పాటు చేస్తే పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చిన 60కి పైగా కంపెనీల లెటర్ ఆఫ్ ఇండెంట్లను కేటీఆర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ ఇప్పటికే వరంగల్, ఖమ్మం, కరీంనగర్ లాంటి పట్టణాల్లో ఐటి టవర్ల నిర్మాణ కోసం ప్రభుత్వ ఆమోదం తెలిపిందని, త్వరలోనే నిజామాబాద్‌లో ఐటీ హబ్‌ను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. ఈ ఐటి హబ్ కోసం మొదటి దశలో 25కోట్లు వ్యయం చేయనున్నట్లు తెలిపారు. ఐటి హబ్‌లో ఇంకుబేటర్ సెంటర్ కూడా ఉంటుందన్నారు. వచ్చే ఏడాదిలో టిఎస్ఐఐసి ఇందుకు సంబంధించిన మౌళిక వసతులను ఏర్పాటు చేస్తుందన్నారు.













