తెలంగాణలో పెట్టుబడులు పెట్టండి.. ప్రవాసులకు మంత్రి కొప్పుల పిలుపు
తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని అమెరికన్ సంస్థలను రాష్ట్ర ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కోరారు. ప్రస్తుతం అమెరికాలో పర్యటిస్తున్న మంత్రి పెనాన్స్ నగరంలో బీఆర్ఎస్ నాయకులు ఆనంద్ రాజ్ గుంటకు ఆధ్వర్యంలో తెలంగాణ ప్రవాసులు, పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి అండగా నిలవాలని అమెరికన్ సంస్థలకు విజ్ఞప్తి చేశారు. 10 రోజుల అమెరికా పర్యటనలో భాగంగా ఇప్పటికే సాల్ట్ లేక్ సిటీలోని ఎల్డీఎస్ హ్యుమానిటేరియన్ సెంట్రల్ వేర్ హౌస్ రూట్స్ టెక్‌ను మంత్రి సందర్శించారు.













