కవిత అరెస్టుకు.. తెలంగాణ ప్రజలకు ఏం సంబంధం : మంత్రి కోమటిరెడ్డి

ఢిల్లీ మద్యం కేసుకు, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఏం సంబంధమని తెలంగాణ రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ప్రశ్నించారు. ఈ సంద్భంగా వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కవితను ఈడీ అధికారులు అరెస్టు చేశారని తెలిపారు. ఇందుకు నిరసనగా ధర్నాలు చేసి ప్రజలను ఇబ్బందులు పెట్టడం ఎందుకన్నారు. గతంలో చంద్రబాబు అరెస్టును ఖండిస్తూ నిరసనలు తెలిపితే అడ్డుకున్నారని గుర్తు చేశారు. ఆనాడు ధర్నాలు అడ్డుకున్న వారే, నేడు చేయడం విడ్డూరం. ఏపీ అంశాలపై హైదరాబాద్‌లో నిరసనలు ఎందుకన్నారు. కానీ ఇప్పుడు కవితను ఈడీ అరెస్టు చేస్తే రాష్ట్రంలో ఆందోళనలు ఎందుకు చేస్తున్నారు. ఢల్లీిలోని ఈడీ కార్యాలయం ముందు చేసుకోండి. అమాయక కార్యకర్తలను రోడ్లపైకి తెస్తున్నారు అని మండిపడ్డారు.