కేంద్రమంత్రి గడ్కరీతో కోమటిరెడ్డి వెంకటరెడ్డి భేటీ
తెలంగాణ రాష్ట్రంలోని 14 రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా మార్చాలన్న తమ వినతికి కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి సానుకూలంగా స్పందించారని తెలంగాణ రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడిరచారు. ఢిల్లీలో గడ్కరీని మంత్రి కలిసి రాష్ట్రానికి సంబంధించిన ఫెండిరగ్ సమస్యలు, జాతీయ రహదారులకు సంబంధించి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గడ్కరీని కలిసి వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రహదారుల పరంగా రాష్ట్రానికి నిధులు పెంచడం, జాతీయ రహదారులను వీలైనన్నీ పెంచాలని కోరగా కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారని అందుకు గానూ గడ్కరీకి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రానికి వీలైనన్ని ఎక్కువ నిధులు తీసుకువచ్చేందుకు కృషి చేస్తానని తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ గెలుపుకు కృషి చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా సుపరిపాలనను అందిస్తామని మంత్రి భరోసా ఇచ్చారు.













