అమెరికాకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

తెలంగాణ రాష్ట్ర ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సోమవారం సాయంత్రం అమెరికాకు బయలుదేరి వెళ్లారు. 7న అమెరికాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి ప్రవాస భారతీయ నాయకులతో జరిగే మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్ తవ్వకాన్ని వేగవంతం చేసేందుకు అవసరమైన అధునాతన బేరింగ్ మెషినరీని సమకూర్చేందుకుగాను 12న ఓహియోలోని రాబిన్స్ టన్నెల్ బేరింగ్ మెషినరీ తయారీ కంపెనీ సీఈవో లాక్‌హోమ్‌తో మంత్రి కోమటిరెడ్డి సమావేశమవుతారు.