ప్రధాని మోదీనో… కేంద్ర మంత్రులో స్పందించాలి
ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశంపై చిల్లరగాళ్లు కాదు స్పందించాల్సింది ప్రధాని మోదీనో కేంద్ర మంత్రులతో స్పందించాలని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి బీజేపీ నేతలపై ఫైర్ అయ్యారు. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జగదీష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ దమ్ముంటే ముఖ్యమంత్రి కేసీఆర్ సంబంధించిన ప్రశ్నలకు ప్రధాని మోదీతో లేదు అంటే కేంద్ర కేంద్రమంత్రులతో సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోళ్లపై బీజేపీకి చిత్తశుద్ది ఉంటే పార్లమెంట్లో చర్చకు పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. చర్చకు టీఆర్ఎస్ పార్టీ సన్నద్ధంగా ఉందని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ అడిగిన దాంట్లో తప్పేముందని ఆయన సూటిగా ప్రశ్నించారు.













