శ్రీలంకలా మారింది గుజరాత్, యూపీ రాష్ట్రాలే : మంత్రి జగదీష్ రెడ్డి
శ్రీలంకలా మారింది గుజరాత్, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలే, తెలంగాణ అభివృద్ధిలో దూసుకెళ్తుందని అని రాష్ట్ర మంత్రి జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆకలి ఇండెక్స్‌లో పాకిస్థాన్, బంగ్లాదేశ్ తరువాతి స్థానంలో భారత్ ఉందంటే అందుకు బీజేపీ వైఫల్య పాలనే కారణమని విమర్శించారు. బీజేపీ పాలనలో భారత్ సోమాలియాగా మారినా ఆశ్చర్యం లేదన్నారు. తెలంగాణ పథకాలను మొన్నటి వరకు మెచ్చుకుని ఇప్పుడు ఓట్ల రాజకీయం కోసం రాష్ట్రంపై కుట్రలు చేస్తున్నారని అన్నారు. తెలంగాణలో అమలవుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు తమకు కూడా కావాలని బీజేపీ పాలిత రాష్ట్రాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారని తెలిపారు. అలాంటి పథకాలను అమలు చేయలేకనే రాష్ట్రంపై బీజేపీ కుట్రలు చేస్తు చీకట్లోకి నెట్టే ప్రయత్నం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఢల్లీి నుంచి బీజేపీ గద్దె దింపుతేనే దేశ ప్రజల ఆకలి తీరుతుందన్నారు.













