ఎవరు ఎక్కడ సభలు పెట్టుకున్నా.. అడ్డుకునేవారు లేరు
తెలంగాణ రాష్ట్రంలో రాహుల్‌గాంధీ పర్యటనను అడ్డుకోవాల్సిన అవసరం టీఆర్ఎస్కు లేదని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎవరు, ఎక్కడ సభలు పెట్టుకున్నా అడ్డుకునేవారు లేరని స్పష్టం చేశారు. దేశం మొత్తం చీకట్లో మగ్గిపోతుంటే, తెలంగాణ మాత్రం వెలిగిపోతోందన్నారు. కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలో టీఆర్ఎస్పై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. నిరుద్యోగుల మద్దతు ఉందని కాంగ్రెస్ కలలు కంటోంది. ఉద్యోగ ప్రకటనలు రావడంతో కాంగ్రెస్ నేతల్లో భయం పట్టుకుందన్నారు. ఉస్మానియా యూనివర్సిటీల్లో అలజడి సృష్టించాలని ప్రయత్నిస్తున్నారు.













