ఏపీ వాదనలో నిజం లేదు : మంత్రి జగదీశ్ రెడ్డి
నాగార్జున సాగర్ నుంచి విద్యుత్ ఉత్పత్తి కోసం తాము నీటిని వినియోగించడం లేదని, ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిల్లరగా వ్యవహరిస్తున్నదని రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ ప్రభుత్వం చీటికీమాటికీ కృష్ణా నది మేనేజ్‌ంట్ బోర్డు (కేఆర్ఎంబీ)కు ఫిర్యాదు చేస్తున్నదని అసహనం వ్యక్తం చేశారు. అసంబద్ధమైన ఆరోపణలు, ఫిర్యాదులు చేసి ఏపీ ప్రభుత్వం తన గౌరవాన్ని దిగజార్చుకుంటున్నదని విమర్శించారు. సాగర్ నుంచి విద్యుత్ ఉత్పత్తి కోసం నీటిని తెలంగాణా వినియోగిస్తున్నదనే ఏపీ సర్కారు వాదనలో నిజం లేదని స్పష్టం చేశారు. సాగర్‌నుంచి తెలంగాణకు తాగునీటి అవసరాలు ఎక్కువని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో ఫిర్యాదుల్లో సహేతుకత లేదన్నారు. డిమాండ్ ఎక్కువ ఉన్న సమయంలో గ్రిడ్‌ను కాపాడేందుకు అప్పుడప్పుడు సాంకేతికపరంగా ఐదు, పది నిమిషాల ఉత్పత్తి జరగడం సహజమేనన్నారు. శ్రీశైలం నుంచి తెలంగాణ విద్యుదుత్పత్తి ఆపేసినా ఆంధ్రప్రదేశ్ కొనసాగిస్తున్నదని, అయినా తాము చిల్లర ఫిర్యాదులు చేయడం లేదని అన్నారు.













