ఆ ఘనత సీఎం కేసీఆర్‌దే : మంత్రి జగదీశ్ రెడ్డి
యాదాద్రి పునర్ నిర్మాణం ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దే అని రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. యావత్ ప్రపంచంలోనే ఈ పునర్ నిర్మాణం అరుదైన ఘట్టంగా ఆయన అభివర్ణించారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా పునర్నిర్మించిన యాదాద్రి దేవాలయ ప్రారంభం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. యాదాద్రి వంటి పునర్ నిర్మాణం ఘట్టంలో సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో జిల్లా మంత్రిగా పలు పంచుకోవడం మహద్భాగ్యంగాగా భావిస్తున్నాన్నారు. ముఖ్యంగా దేవాలయానికి అన్నీ తానై శిల్పి అవతరమెత్తి యాదాద్రి పునర్ నిర్మాణం రూపంలో అద్బుతాన్ని సీఎం కేసీఆర్ సృష్టించారని అన్నారు. దేవాలయ పున ప్రారంభోత్సవం సంద్భంగా నిర్వహిస్తున్న మహా సంప్రోక్షణలో పాల్గొనడం మహాదృష్టంగా భావిస్తున్నాని పేర్కొన్నారు.













