ఆయన జన్మదిన వేడుకలు జరిపేది.. ఒక్క తెలంగాణలోనే
అధికారికంగా సేవాలాల్ జన్మదిన వేడుకలను జరిపేది ఒక్క తెలంగాణలోనేనని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. యాదాద్రి జిల్లా సంస్థాన్ నారాయణపురంలో సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో సంస్కృతి, సంప్రదాయాలకు తెలంగాణలో పెద్ద పీట వేయడం జరిగిందన్నారు. సంత్ సేవాలాల్‌ను ఘనతను కేసీఆర్ గుర్తించారన్నారు. రాష్ట్రంలో తండాలను గ్రామపంచాయతీలుగా మార్చిన ఘనత కేసీఆర్‌దేనని ఆయన పేర్కొన్నారు. అధికారికంగా పండుగలు, పేదలకు దుస్తులు పంపిణీ చేస్తున్నది కేసీఆర్ ఒక్కరేనన్నారు. సంత్ సేవాలాల్ సేవలు దేశానికే గర్వకారణమన్నారు. మానసిక రుగ్మతలను రూపుమాపిన యోధుడు సేవాలాల్ అని కొనియాడారు.













