నల్లగొండలో పాస్ పోర్టు కేంద్రం ప్రారంభం
ప్రతి ఇంట్లో జరిగే ఆడబిడ్డ పెళ్లికి ముఖ్యమంత్రి కేసీఆర్ మేనమామలాగ చేయూతనందిస్తున్నారని మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. నల్లగొండలో పోస్టుఆఫీస్ పాస్పోర్టు సేవా కేంద్రాన్ని ప్రారంభించిన సందర్భంగా మంత్రి మాట్లాడారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ఆర్థిక సాయం రూ.1,00,116లకు పెంచి ముఖ్యమంత్రి కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. బడుగు, బలహీన వర్గాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా నిలబడుతున్నారని చెప్పారు. ఆడబిడ్డల పెళ్లిళ్లు చేయలేక సతమతం అవుతున్న వారందరికి ఆర్థిక సాయం పెంపు గొప్ప ఊరట కలిగించిందని పేర్కొన్నారు. కల్యాణలక్ష్మి పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందని తెలిపారు.













