మునుగోడులో ఓడినందుకే ..మోదీపై మంత్రి విమర్శలు
తెలంగాణ పర్యటనలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వంపై మోదీ చేసిన విమర్శలపై రాష్ట్ర మంత్రి జగదీష్ రెడ్డి ఘాటుగా స్పందించారు. మునుగోడులో బీజేపీ ఓడిందన్న కోపం మోదీ మాటల్లో కళ్లకు కట్టినట్లు కనిపిస్తుందని, టీఆర్ఎస్ పార్టీపై కుట్రలు జరుగుతున్నాయని, కేసీఆర్పై విషం చిమ్మే అజెండాతోనే మోదీ రాష్ట్ర పర్యటనకు వచ్చారని జగదీష్ విమర్శలు గుప్పించారు. కానీ మోదీ అనుకుంటున్నట్లు తెలంగాణ ప్రజలు పిచ్చోళ్లు కాదని, కుట్రపూరిత మాటలతో రాష్ట్ర ప్రజలను మోసం చేయలేరని జగదీష్ రెడ్డి అన్నారు. అంతేకాకుండా రాష్ట్రంలో అవాస్తవాలను పునాదులుగా వేసి బీజేపీ విస్తరణకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వంపై అబద్దపు విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు.













