అలాంటి వ్యక్తికి ఎన్నికల్లో పోటీ చేసే హక్కు లేదు
మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని తెలంగాణ రాష్ట్ర మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్కు కాంగ్రెస్ పార్టీనే పోటీయని తెలిపారు. మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తే పెండింగ్ సమస్యలన్నీ పరిష్కారమవుతాయని తెలిపారు. అమ్ముడు పోయిన వ్యక్తికి ఎన్నికల్లో పోటీ చేసే నైతిక హక్కు ఉండదని అన్నారు. రాజగోపాల్ రెడ్డి దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. మునుగోడు ప్రజల నమ్మకాన్ని రాజగోపాల్ రెడ్డి అమ్ముకున్నారు. కాంట్రాక్టుల కోసమే రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి వెళ్లినట్లు బహిర్గతమైంది. ఆర్నెళ్ల క్రితం రూ.18 వేల కోట్ల కాంట్రాక్టులు వచ్చినట్లు నిన్న రాజగోపాల్ రెడ్డి తెలిపారు. కాంట్రాక్టుల కోసం అమ్ముడుపోయి త్యాగాలు చేశాననటం హాస్యాస్సదంగా ఉందన్నారు.
ఏ కారణం వల్ల మునుగోడు ఉప ఎన్నిక వచ్చిందో రాజగోపాల్ రెడ్డి చెప్పాలన్నారు. జాతీయ స్థాయిలో కేసీఆర్కు వస్తున్న ఆదరణను చూసి కుట్రతోనే మునుగోడు ఎన్నికకు తెచ్చారు. బీజేపీ అభ్యర్థికి ఓటు వేస్తే విద్యుత్ చట్టాలు అమలవుతాయి. మోటార్లకు మీటర్లు వస్తాయి. మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్థి గెలిస్తే పెండిరగ్ సమస్యలన్నీ పరిష్కారమవుతాయి. మునుగోడులో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది. టీఆర్ఎస్కు కాంగ్రెస్ పార్టీనే పోటీ అని తెలిపారు.













