గత సంవత్సరం సందడి లేకున్నా.. ఈసారి ఘనంగా
ఖైరతాబాద్ గణేషున్ని తెలంగాణ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దర్శించుకున్నారు. మహాగణపతి దర్శనానికి వెళ్లిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేసి శాలువతో సత్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ గణేష్ఉత్సవాలు ప్రతి సంవత్సరం ఎంతో ఘనంగా జరుగుతాయని అన్నారు. గత సంవత్సరం కరోనా కారణంగా పండగ సందడి లేకున్నా ఈసారి మాత్రం ఘనంగా జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. నిమజ్జన ర్యాలీలో కూడా ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. కోవిడ్ మహమ్మారిని పూర్తిగా నివారించాలని ఆ దేవుడిని కోరుకున్నట్టు తెలిపారు. కొవిడ్ నిబంధనలు ప్రతి ఒక్కరూ పాటించాలని, తప్పని సరిగా మాస్క్లు ధరించాలని అన్నారు.













