వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కు కరెంట్ షాకివ్వాలి : మంత్రి హరీశ్ రావు
ఉచిత కరెంట్‌పై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చేసిన అడ్డగోలు మాటలపై తెలంగాణ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రైతన్న సంక్షేమం కోసం ఏనాడు ఆలోచించని కాంగ్రెస్ పార్టీ నాయకులు, కేసీఆర్ పాలనలో రైతులకు అందుతున్న సంక్షేమ, అభివృద్ధి ఫలాలను అధికారంలోకి వస్తే అందకుండా చేస్తామంటూ అడ్డగోలుగా మాట్లాడుతున్నారని నిప్పులు చెరిగారు. నాకు తెలంగాణ ఉద్యమంపై తుపాకీ ఎక్కువపెట్టిన మనిషే, నేడు పచ్చబడ్డ తెలంగాణను చూసి విషం చిమ్ముతున్నాడాని ధ్వజమెత్తారు. పార్టీ మారినా మనిషి మారలేదు. మనసు కరగ లేదు. పైశాచికత్వంతో తెలంగాణ సమాజంపై పగబట్టినట్టు వ్యవహరిస్తున్న కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ అధ్యక్షుడికి రైతులు తగిన శాస్త్రి చేయాలి. రైతన్నకు కరెంట్ వద్దన్న కాంగ్రెస్ నాయకులను వచ్చే ఎన్నికల్లో కరెంట్ షాక్ ఇవ్వాలి అని రైతులకు సూచించారు.













