అది జరగాలంటే రాజ్యాంగం మార్చాలనడం తప్పా? : హరీశ్ రావు
ఎస్టీ, మైనారిటీ రిజర్వేషన్ పెంచాలని, అది జరగాలంటే రాజ్యాంగం మార్చాలనడం తప్పా అని తెలంగాణ రాష్ట్ర వైద్యారోగ శాఖ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు. తెలంగాణ భవన్లో మంత్రి మీడియాతో మాట్లాడుతూ ఏ విషయంలోనూ కేంద్రం నుంచి రాష్ట్రానికి మద్దతు లేదని అన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కేసీఆర్ గురించి మాట్లాడే అర్హత లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజల వాడుక భాషనే కేసీఆర్ మాట్లాడతారన్నారు. మతాల మధ్య చిచ్చుపెట్టే భాష బీజేపీదని అన్నారు. కేసీఆర్ ప్రశ్నలకు దమ్ముంటే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సొల్లు పురాణం వద్దని చిత్తశుద్ధి ఉంటే వర్గీకరణ చేయాలని సూచించారు. జాతీయ ప్రాజెక్టు, ఐఐఎం, ఐఐటీ ఇవ్వమని కిషన్ రెడ్డి ఎందుకు అడగడం లేదని ప్రశ్నించారు.













