కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా… తెలంగాణ వ్యాప్తంగా ఊరూరా చావు డప్పు
ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసన తెలంగాణ వ్యాప్తంగా ఊరూరా చావు డప్పు పేరుతో టీఆర్ఎస్ శ్రేణులు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ నిరసనల్లో రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు, నేతలు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం, బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పలుచోట్ల ప్రధాని నరేంద్ర మోదీ దిష్టిబొమ్మను దహనం చేశారు. తెలంగాణ రైతుల ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. గజ్వేల్‌లో మంత్రి హరీశ్‌రావు, ఖమ్మంలో మంత్రి పువ్వాడ అజయ్ తదితరులు ఆందోళనల్లో పాల్గొన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ధాన్యం బస్తా తలపై మోస్తూ నిరసన తెలిపారు. రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో నిర్వహించిన నిరసన కార్యక్రమాల్లో ఎమ్మెల్యేలు, స్థానిక టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు.













