మన భవిష్యత్తు వాళ్ల చేతుల్లో పెడదామా? : హరీష్ రావు
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని మంత్రి హరీష్ రావు అన్నారు. ఆదిలాబాద్ ప్రజాశీర్వాద సభలో హరీష్రావు మాట్లాడుతూ కేసీఆర్ అంటే ఒక నమ్మకం, కాంగ్రెస్ అంటే బూటకమన్నారు. ఆదిలాబాద్ జిల్లా అభివృద్ధి ఖిల్లాగా మారిందన్నారు. కేసీఆర్ చావు నోట్లోకి వెళి తెలంగాణ తెచ్చిండు. ఇంటింటా నళ్లా నీరు ఇచ్చాం. కాంగ్రెస్లో కుర్చీల కోసం కొట్లాడే నాయకులున్నారు. కొందరు బూతులు మాట్లాడే నాయకులు ఉన్నారు. కుర్చీ కోసం కోట్లాడే నాయకులకు ఓట్లు వేద్దామా? మన భవిష్యత్తు వాళ్ల చేతులో పెడుదామా? అని ప్రశ్నించారు.













