బీజేపీకి క్యాడర్ లేదు.. కాంగ్రెస్ కు అభ్యర్థులు లేరు
బీజేపీకి క్యాడర్ లేదని, కాంగ్రెస్‌కు అభ్యర్థులు లేరని తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి మెదక్ జిల్లాలోని అన్ని స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ సీట్లను అమ్ముకుంటోందని విమర్శించారు. ఈ నెల 23 మెదక్ జిల్లా కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాలతో పాటు బీఆర్ఎస్ కార్యాలయాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని తెలిపారు. ఆసరా పింఛను పెంపును మెదక్ నుంచే సీఎం ప్రారంభిస్తారన్నారు. దివ్యాంగులకు ఆసరా పింఛను రూ.4,016కు పెంచుతున్నట్లు తెలిపారు.













