18న కరీంనగర్లో ఐటీ టవర్ ప్రారంభం
హైదరాబాద్లో పాటు రాష్ట్రంలోని మిగతా పట్టణాలను అభివృద్ధి చేయాని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ అన్నారు. త్వరలో కరీంనగర్ ఐటీ టవర్ను ప్రారంభిస్తామని తెలిపారు. కరీంనగర్ జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాపై మంత్రి గంగుల కమలాకర్, వినోద్ కుమార్ మీడియాతో మాట్లాడారు. కరీంనగర్లో నిర్మించిన ఐటీ టవర్ను ఈనె 18న ప్రారంభించనున్నట్లు మంత్రి గంగుల తెలిపారు. స్థానిక యువతకు ఉపాధి కల్పనే ధ్యేయంగా అతి తక్కువ వ్యవధిలో నిర్మించిన టవర్ను ఐటీ, పరిశ్రమ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారని తెలిపారు. తొలుత 12 కంపెనీలతోనే ప్రారంభించాలని భావించామని పేర్కొన్నారు. ఏడాది తర్వాత ఉద్యోగుల సంఖ్య పెంచాలనే నిబంధనతో కంపెనీతో ఒప్పందం చేసుకుంటున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా పలువురికి నియామక పత్రాలు కూడా అందజేస్తామని తెలిపారు.













