తండ్రికి తగ్గ తనయుడిగా ఆయన పేరు తెచ్చుకున్నాడు
మంత్రి కేటీఆర్ పనితీరు వల్లే స్థానిక సంస్థల ఎన్నికల్లో భారీ విజయాన్ని నమోదు చేసుకున్నామని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. తండ్రికి తగ్గ తనయుడిగా ఆయన పేరు తెచ్చుకున్నారని కొనియాడారు. తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో కమలాకర్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పనితీరు చరిత్రలో నిలిచిపోతుందన్నారు. వచ్చే 40 ఏళ్లపాటు తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలో ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దేశమంతా కేసీఆర్ ప్రధాని కావాలని కోరుకుంటోందన్నారు. దేశం అభివృద్ధి చెందాలంటే కేసీఆర్ ప్రధాని, రాష్ట్రంలో కేటీఆర్ సీఎం కావాలని అన్నారు.













