సోమవారం కేసీఆర్ ను చూసి తెరాస ఎందుకు ఆశ్చర్యపోయింది…?
తెలంగాణలో ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ ఇబ్బంది పడక పోయినా సరే కొన్ని కొన్ని అంశాల్లో టిఆర్ఎస్ పార్టీలో వర్గ విభేదాలు సీఎం కేసీఆర్ ను ఇబ్బంది పెడుతున్నాయి అనే మాట వాస్తవం. వాస్తవానికి టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నుంచి కూడా ఇప్పటివరకు పార్టీ జెండా మోసిన కొంతమంది నేతలకు టిఆర్ఎస్ పార్టీలో న్యాయం జరగటం లేదు అనే ఆవేదన కొంతమంది వ్యక్తం చేస్తున్నారు. అందులో ప్రధానంగా ఈటెల రాజేంద్ర, హరీష్ రావు విషయంలో కొన్ని ఆరోపణలు ప్రతిపక్షాలు ఎక్కువగా చేస్తూ ఉంటాయి.
ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డి పదే పదే ఈ వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. హరీష్ రావుని కేటీఆర్, కేసీఆర్ మోసం చేస్తున్నారని ఆయన ఆరోపిస్తూ ఉంటారు. అయితే ఆరోపణల విషయంలో హరీష్ రావు కూడా పెద్దగా స్పందించే ప్రయత్నం చేయరు. బిజెపి నేతలు కూడా అప్పుడప్పుడు హరీష్ రావు కు అండగా నిలబడుతూ ఆయనకు అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు ఈటెల రాజేందర్ విషయంలో టిఆర్ఎస్ పార్టీలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. ఆయన కరీంనగర్ లో చేసిన వ్యాఖ్యలు తర్వాత సీఎం కేసీఆర్ ఇబ్బంది పడ్డారో లేదో తెలియదుగానీ సోమవారం ప్రగతి భవన్ కి పిలవడం ఆయనతో దాదాపు రెండు గంటలపాటు చర్చించడం మీడియా వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.
ఈటెల రాజేంద్ర ప్రగతి భవన్ కు వెళ్లిన వెంటనే స్వయంగా కేటీఆర్… సీఎం కేసీఆర్ వద్దకు తీసుకెళ్లడం వంటివి విస్మయానికి గురి చేశాయి. వాస్తవానికి సీఎం కేసీఆర్ టిఆర్ఎస్ పార్టీలో అసంతృప్తుల విషయంలో ముందు నుంచి కూడా పెద్దగా దృష్టి పెట్టేవారు కాదు. కానీ ఈటెల రాజేందర్ విషయంలో సీఎం కేసీఆర్ కాస్త భిన్నంగా వ్యవహరించడం వెనుక అసలు కారణం ఏంటి అనేది ఇప్పుడు మీడియా వర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది. టిఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే సీట్లు అడిగిన వాళ్ళు ఎంపీ సీట్లు, రాజ్యసభ అడిగిన వాళ్ళు, ఎమ్మెల్సీ సీట్లు అడిగిన వాళ్ళు సీఎం కేసీఆర్ ను కనీసం ఒకసారైనా కలవాలి అని భావించే వాళ్ళు ఎందరో ఉన్నారు.
వారి ఆవేదన కెసిఆర్ ఒక్కసారైనా వుంటే బాగుంటుంది అని కోరుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ సీఎం కేసీఆర్ రాజేంద్ర విషయంలో భిన్నంగా ప్రవర్తించారు. గతంలో టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నేతలు ఎందరో పార్టీ విషయంలో మేమే యజమానులం అని బహిరంగ ప్రకటనలు చేసినా సరే సీఎం కేసీఆర్ పెద్దగా పట్టించుకునే ప్రయత్నం చేయలేదు. నాయిని నరసింహారెడ్డి లాంటివాళ్ళు సీట్లు రాకపోయినా సరే ఏమి చేయలేని పరిస్థితిలో కి వెళ్లి పోయారు. కానీ ఈటెల రాజేంద్ర అలగడంతో ఆయనకు ఆరోగ్య శాఖ మంత్రి పదవి ఇచ్చారు… ఇప్పుడు ఈటల రాజేంద్ర ఇబ్బందిపడుతూ వ్యాఖ్యలు చేయడంతో ఆయనను నేరుగా బుజ్జగించే కార్యక్రమం మొదలు పెట్టారు. దీంతో అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది ఆసక్తికరంగా మారింది.













