మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన మంత్రి ఈటల
టీఆర్ఎస్ సీనియర్ నేత, మంత్రి ఈటల రాజేందర్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. దొడ్డి కొమురయ్య జయంతి వేడుకల్లో మంత్రి ఈటల పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కులాల ప్రాతిపదికన రాజకీయాలు జరిగే దుర్మార్గపు ఆలోచన ఇక్కడే ఉందన్నారు. మార్పు రావాల్సిన అవసరం ఉందని అన్నారు. ఇది ఆత్మగౌరవ సమస్య, చైతన్యాన్ని చంపితే ఉన్మాదమే వస్తుందన్నారు. ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కింది కులాల మీద ఉందని వ్యాఖ్యానించారు. పట్టా భూముల సమస్యలను మా దృష్టికి తీసుకురావాలని అన్నారు. జానెడు భూమి కోసం ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయన్నారు. ప్రభుత్వమే భూములను పేదలకు పంచుతుందని తెలిపారు.













